© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: దేమీ కలాన్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ... ఎస్ ఆర్ ఎస్ న్యూస్: తాడ్వాయి,మార్చి10:.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమీ కలాన్ గజిటెడ్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ (PRTU) తెలంగాణ రాష్ట్ర క్యాలెండర్ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్య ప్రకాష్ ఈ క్యాలెండర్ను ఆవిష్కరించి,ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి,సుధాకర్,రాధ, భాస్కర్ రెడ్డి, నారాయణ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి • సుమారు 17 గంటల క్రితం24
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • 2 రోజుల క్రితం23
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • 2 రోజుల క్రితం422