నెట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు రిప్పల్స్ విద్యార్థుల ఎంపిక
రాష్ట్ర స్థాయి నెట్‌బాల్ పోటీలకు రిప్పల్స్ విద్యార్థులు
-
జిల్లా స్థాయి ఎంపికల్లో ఐదుగురికి స్థానం
-
బిచ్కుంద రిప్పల్స్ లెర్నింగ్ క్యాంపస్ విద్యార్థుల ప్రతిభ
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: జుక్కల్
కామారెడ్డి జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భిక్నూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలలో బిచ్కుందలోని రిప్పల్స్ లెర్నింగ్ క్యాంపస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.
ఎంపికైన విద్యార్థుల వివరాలు:
-
సబ్-జూనియర్ విభాగం: N. శ్రీహిత,S. పండరి, రిడా ఫాతిమా
-
జూనియర్ విభాగం: H. మానస, A. బాలాజీ ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్, కరస్పాండెంట్ అనిల్ కుమార్ మరియు ప్రిన్సిపాల్ బాలరాజు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దార్ఢ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం యావత్ పాఠశాలకు గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో ఉత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన పీఈటీ (PET) స్వామి బస్వరాజ్ అప్పాను, విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం మరియు తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.