© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పిట్లం, బాన్సవాడ, కామారెడ్డి ప్రాంతాల్లో స్కూల్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ పత్రాలు,ఫస్ట్ ఎయిడ్ కిట్లు,ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తదితర భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి (AMVI) స్నిగ్ధ స్కూల్ బస్సు డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రతి డ్రైవర్ వాహనానికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. అలాగే అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించకూడదని, విద్యార్థుల భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 10 రోజుల క్రితం58

కామారెడ్డి • 7 రోజుల క్రితం8

కామారెడ్డి • 8 రోజుల క్రితం70
Newకామారెడ్డి • సుమారు 24 గంటల క్రితం22