© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలి... జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్.. మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నీచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంపు వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు.ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని,ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించి, శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు,తప్పిదాలకు తావులేకుండా అప్రమత్తతతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని అన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.నోడల్ ఆఫీసర్లుగా నియమించబడ్డ అధికారులు తమతమ విధులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఆర్డీవోలు, నాలుగు మున్సిపాలిటీల అధికారులతో సమీక్షిస్తూ ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ( అర్బన్), వీధి కుక్కల నియంత్రణ , శానిటేషన్, ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్,టాక్స్ కలెక్షన్ తదితర అంశాల పై రివ్యూ నిర్వహించి పురోగతి పై ఆరా తీశారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ మధు మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ,సీఈఓ చందర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆర్డీవోలు పార్థ సింహ రెడ్డి,వీణ, కామారెడ్డి,బాన్స్వాడ,ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపల్ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు,మేనేజర్లు,రెవెన్యూ అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి • 10 రోజుల క్రితం58

కామారెడ్డి • 7 రోజుల క్రితం25

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 8 రోజుల క్రితం77

కామారెడ్డి • 4 రోజుల క్రితం50