© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

నిజామాబాద్: కోడిపందాలు,పేకాట,అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు : పోలీస్ కమీషనర్ వెల్లడి... జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పేకాట, కోడిపందాలు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐపీఎస్, ఒక ప్రకటనలో తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతర వాహన తనిఖీలు,సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్ర మరియు నిజామాబాదు కు చుట్ట సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని తెలియజేశారు. అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.

నిజామాబాద్ • 5 నెలల క్రితం23

నిజామాబాద్ • 8 నెలల క్రితం27

నిజామాబాద్ • 3 నెలల క్రితం18

నిజామాబాద్ • 6 నెలల క్రితం27

నిజామాబాద్ • 8 నెలల క్రితం47