© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: కలెక్టర్ కార్యాలయం లోని మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లూయీస్ బ్రెయిలీ 217 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన లూయీస్ బ్రెయిలీ తన చిన్నతనంలో నే కంటి చూపును కోల్పోయి తర్వాత తానే స్వయంగా ఒక లిపిని కనుగొని ఎంతో మంది అందులకు ఉపయోగపడేలా చేసి వారి జీవితాలలో వెలుగులను నింపాడు అని అన్నారు. లూయీస్ బ్రెయిలీ జన్మ దినాన్ని పురుస్కరించుకొని హాజరైన అంద వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా న్యాయ సేవ అదికారిని నాగరాణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం చాల అందంగా ఉందని మరియు అంధులు ఎవ్వరు కూడా దేనికి కూడా అధైర్య పడకుండా జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నాడు.అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అంధులు పాటలు పాడటం మరియు తబల వ్రాయించడం. చుసిన కలెక్టర్ గారు వారికి మంచి నైపుణ్యత ఉందని అన్నారు. వారు ఇదే విధంగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ముందుకు సాగాలని వారికి సూచించారు. అదే విధంగా వివిధ సంఘాల నాయకులూ మాట్లాడుతూ జిల్లాలో లూయీ ట్రెయిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ విన్నవించగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ జిల్లా సంక్షేమ అధికారి గారిని విగ్రహాన్ని నెలకొల్పుటకు అదేశించినారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల,మహిళా కమిషన్ మెంబర్ సుధాం లక్ష్మి,సూపరిండెంట్ అరుణ్ భాస్కర్,వికలాంగుల సంఘాల నేతలు, హరిసింగ్,కుమ్మరి సాయిలు, బల్రాజ్ గౌడ్,శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి • 7 రోజుల క్రితం8
Newకామారెడ్డి • సుమారు 24 గంటల క్రితం22

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 9 రోజుల క్రితం57

కామారెడ్డి • 8 రోజుల క్రితం77