© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: ఆపరేషన్ కవచ్ లో బాగంగా రాత్రి వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత.. ప్రజల రక్షణే కామారెడ్డి పోలీసుల లక్ష్యం... నేరస్థులకు భయం – ప్రజలకు భరోసా.. గంజాయి రవాణాను భగ్నం చేసిన పోలీసు సిబ్బందిని అభినందించి క్యాష్ రివార్డు అందజేసిన జిల్లా ఎస్పీ.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమం గణనీయమైన ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అంతరాష్ట్ర దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుదల,గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు జిల్లాలో నేరలను అదుపులోకి తీసుకువస్తున్నారు.ఈ క్రమంలో రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా ప్రతీ వాహనం కూడా తనిఖీ చేయబడుతున్నాయి. ఆపరేషన్ కవచ్ లో భాగంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద రాత్రి సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ బృందం అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ క్రమములో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటోను కూడా ఆపి అనుమానంతో పూర్తిగా తనిఖీ చేయగా అందులో ఏర్పడకుండా దాచిన గంజాయిని గుర్తించారు. వెంటనే ఆటోలో గంజాయిని తరలిసుతున్న ముగ్గురు నిందితులను పట్టుకొని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ నందు అప్పగించగా, దేవునిపల్లి పియస్ అధికారులు వారిపై కేసు నమోదు చేసి ముగ్గురు నేరస్తులను అరెస్టు చేయడం జరిగింది.రాత్రి తీవ్ర చలిలోనూ విధులు నిర్వహిస్తూ అప్రమత్తతతో వ్యవహరించి గంజాయి రవాణా చేస్తున్న నేరస్తుల పట్టివేతలో కీలక పాత్ర పోషించిన 6 గురు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డుతో సత్కరించడం జరిగింది. వారి వివరాలు: 1.ఎల్. నరసయ్య (ఏఎస్ఐ, దేవునిపల్లి),2.సుబ్బారెడ్డి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్),3.రెడ్డి నాయక్ (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్),4.సంతోష్ (ఏఆర్ కానిస్టేబుల్),5.బలరాం(ఏఆర్ కానిస్టేబుల్)6.భూపతి (హోమ్ గార్డ్ – దేవునిపల్లి పీఎస్)ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,..ప్రజల భద్రతే పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు.రాత్రి సమయంలో చలిని కూడా లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయములో కూడా ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆపరేషన్ కవచ్ ద్వారా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే నర్సన్నపల్లి వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టివేత జరిగిందని పేర్కొన్నారు.జిల్లాలోని పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేయడం ఎంతో సంతోషకరమని, విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తూ నేరస్తుల ప్రతీకదలికపై కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే గౌరవం, గుర్తింపు, రివార్డులు వాటంతట అవే వస్తాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమంగా పని చేసే పోలీస్ సిబ్బందికి తగిన అవార్డులు, రివార్డులు ఇకపై కూడా తప్పకుండా అందజేయబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లాలో గంజాయి, దొంగతనాలు మరియు ఇతర అక్రమ కార్యకలాపాలను అణచివేయడానికి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు కొనసాగిస్తుంది. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి • 7 రోజుల క్రితం16

కామారెడ్డి • 7 రోజుల క్రితం25

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 4 రోజుల క్రితం23