© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: కెఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) సహకారంతో ఆర్కే డిగ్రీ & పీజీ కళాశాలలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు,రోడ్డు భద్రత మరియు పౌర బాధ్యతలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మరియు జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొని ట్రాఫిక్ నియమాలతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి,ఆర్కే గ్రూప్ సీఈఓ డా. జైపాల్ రెడ్డి, డీటీఓ కృష్ణ తేజ,డీన్ నవీన్ మరియు ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రోడ్డు భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు వివరించారు. కెఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా, ట్రస్ట్ కోఆర్డినేటర్ నేహా, ట్రస్ట్ సిబ్బంది మరియు కళాశాల అధ్యాపకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 7 రోజుల క్రితం16

కామారెడ్డి • 4 రోజుల క్రితం14

కామారెడ్డి • 8 రోజుల క్రితం77

కామారెడ్డి • 9 రోజుల క్రితం47