© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి . ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి తేదీ: 11 మార్చి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి . కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్... అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద నిధుల కేటాయింపు... మూడు చోట్ల ROBల నిర్మాణానికి కేంద్ర మంత్రి సానుకూల స్పందన... కామారెడ్డి: కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మరియు రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ROB) నిర్మాణం వంటి కీలక అంశాలపై కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రైల్వే అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు.ఈ భేటీలోని ముఖ్యాంశాలు: *స్టేషన్ ఆధునికీకరణ: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) విస్తరణలో భాగంగా, ఓరియంటల్ పాఠశాల నుండి దర్శన్ థియేటర్ ముందు వరకు స్టేషన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే విన్నవించారు. దీనికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. భవనాల పునర్నిర్మాణం: పాత రైల్వే క్వార్టర్లను తొలగించి, నూతనంగా వివేకానంద కాలనీ వైపు ఆధునిక వసతులతో నిర్మించాలని కోరారు. స్టేషన్ రోడ్ వైపు ఉన్న పాత భవనాలను కూడా వివేకానంద కాలనీ వైపు తరలించేలా ప్లాన్స్ సిద్ధమయ్యాయని తెలిపారు.త్వరలో పనులు ప్రారంభం: నూతన రైల్వే భవనం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) ప్లానింగ్ ప్రక్రియ పూర్తయిందని, ప్లాన్స్ డిపార్ట్మెంట్ నుండి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కు ఫైల్స్ వెళ్లాయని మంత్రి స్వయంగా వెల్లడించారు. త్వరలోనే నిధులు కేటాయించి అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.మూడు ROBల నిర్మాణం: జిల్లా కేంద్రంలో అత్యవసరమైన మూడు చోట్ల ROBల ఏర్పాటుకు సంబంధించి గతంలో ఇచ్చిన వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే స్థల పరిశీలన, జాయింట్ ఇన్స్పెక్షన్ మరియు సాయిల్ టెస్టింగ్ పూర్తి చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు కాలపరిమితి: ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులు ప్రారంభించి, గరిష్టంగా రెండు సంవత్సరాల లోపు పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తనకు పూర్తి సహకారం అందిస్తున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ , అలాగే ఈ విషయంలో వెన్నంటి ఉండి సహకరించిన మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారికి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కామారెడ్డి • ఒక రోజు క్రితం50
కామారెడ్డి • 5 రోజుల క్రితం59
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13
కామారెడ్డి • 8 రోజుల క్రితం45
కామారెడ్డి • 4 రోజుల క్రితం14