ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ.. మానవత్వాన్ని చాటుకున్న నేత..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ..
మానవత్వాన్ని చాటుకున్న నేత..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్, కామారెడ్డి తేదీ: 12-03-2026..
ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ.. మానవత్వాన్ని చాటుకున్న నేత
కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి గారి అంతిమయాత్రలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. మోహన్ రెడ్డి మరణవార్త విన్న వెంటనే షబ్బీర్ అలీ వారి నివాసానికి చేరుకుని, భౌతికకాయంపై పూలమాల ఉంచి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. మోహన్ రెడ్డి కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.స్వయంగా పాడే మోసిన షబ్బీర్ అలీ: అనంతరం జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ స్వయంగా పాడే మోసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను,దశాబ్దాల అనుబంధాన్ని చాటుకున్నారు.ఒక సామాన్య కార్యకర్తలా అందరితో కలిసి నడుస్తూ అంతిమ యాత్రలో పాల్గొనడం అక్కడ ఉన్న వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ: "నారెడ్డి మోహన్ రెడ్డి గారు పార్టీకి అత్యంత నిబద్ధతతో పనిచేసిన క్రమశిక్షణ కలిగిన నాయకుడు. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు,పార్టీకి తీరని లోటు.నిరంతరం ప్రజల కోసం శ్రమించే ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయాము" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొని మోహన్ రెడ్డి గారికి కన్నీటి వీడ్కోలు పలికారు.