సీఎం రేవంత్ రెడ్డి 'చలో సిరిసిల్ల' సభను విజయవంతం చేద్దాం
చలో సిరిసిల్ల సభను విజయవంతం చేద్దాం
-
కామారెడ్డి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలి: కాంగ్రెస్ శ్రేణుల పిలుపు
-
మాచారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహణ
మాచారెడ్డి, సెప్టెంబర్ 28:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న 'చలో సిరిసిల్ల' భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు సోమవారం మాచారెడ్డి మండల కేంద్రంలోని షబ్బీర్ అలీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ జన సమీకరణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మాజీ ఎంపీపీ నర్సింగరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సిరిసిల్ల సభను దిగ్విజయ చేయాలని కోరారు. గ్రామ గ్రామం నుంచి ప్రజలను సమీకరించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నౌసీ లాల్ నాయక్, నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, భూమని బాలరాజ్, పండ్ల రాజు, ఐరేని సందీప్, గంప ప్రసాద్, రామ్మోహన్, రాజా గౌడ్, గణేష్ నాయక్, సంతోష్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, అస్మత్, ఖదీర్, డేవిడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.