విశ్వకర్మ జయంతి: కామారెడ్డి హౌసింగ్ బోర్డులో ఘనంగా సంఘ సభ్యుల పూజలు
కామారెడ్డిలో భక్తిశ్రద్ధలతో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో విశ్వకర్మ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ.. శిల్పకళకు, నిర్మాణ విజ్ఞానానికి ఆద్యుడైన శ్రీ విరాట్ విశ్వకర్మను స్మరించుకోవడం ఎంతో అదృష్టమని తెలిపారు. కాలనీలోని విశ్వకర్మ సంఘం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, సర్వజనుల సుభిక్షం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కాలనీ ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకలతో హౌసింగ్ బోర్డు ప్రాంతం ఆధ్యాత్మిక శోభతోకళకళలాడింది.