© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: అతి వేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి ఓ టిప్పర్ వాహనం స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మృతి చెందిన వారు ముగ్గురు ఖమ్మం జిల్లా బోనకాల మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరొకరు అదిలాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. అదిలాబాద్ జిల్లా కు చెందిన కిషన్ తన కుమార్తె జాస్లీన్ ను ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముస్తికుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. జాస్లీన్ కు నాలుగు సంవత్సరాల జోయల్ ప్రకాష్, ఆరు నెలల జోయల్ జడ్సన్ కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడైన జాడ్సన్ కు టీకా ఇప్పించేందుకు కామారెడ్డికి వచ్చారు. ఈ క్రమంలో ప్రకాష్ తన కుమార్తె జాస్లీన్ తోపాటు మనుమండ్లను బైక్ పై కామారెడ్డి నుంచి బంధువుల ఇంటికి తీసుకు వెళుతుండగా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ఎదురుగా టిప్పరు వచ్చి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న కిషన్, జాస్లీన్, జోయల్ ప్రకాష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జోయల్ జాడ్సన్ ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ జోయల్ జాడ్సన్ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 4 రోజుల క్రితం14

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 5 రోజుల క్రితం28