© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: నానో యూరియాను వాడి అధిక ఫలితాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లాలోని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలంలోని తాడ్వాయి గ్రామ రైతులకు నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో వరి పంటపై డ్రోన్ ద్వారా పిచికారి మరియు అవగాహన కల్పించడం జరిగింది. రైతులు సాధారణంగా యూరియాని వివిధ పంటలకు నేరుగా అధిక మోతాదులో వాడడం వలన రైతుల భూమి యొక్క సారాన్ని కోల్పోవడం మరియు పర్యావరణ కాలుష్యం మరియు చీడపీడలు అధికంగా వస్తుండటం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం రైతులు వాడుతున్న పాత పద్ధతిని మానుకొని యూరియాకి బదులుగా నానో యూరియాను ద్రవణ రూపంలో వివిధ పంటలకు పిచికారి చేయడం వల్ల శ్రేయస్కరం అని మరియు ఆర్థికంగా తక్కువగా ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు ఈ నానో యూరియాను పిచికారి చేయవచ్చు అని తెలిపారు. రైతు సాధారణంగా ఒక రోజులో 5-7 ఎకరాలు మాత్రమే వెదజల్లడాన్ని అవకాశం ఉంటుంది. కానీ డ్రోన్ పద్ధతిలో నానో యూరియాను పిచికారి చేయడం వలన రోజుకు 50 నుంచి 70 ఎకరాల వరకు పిచికారి చేయడానికి అవకాశం ఉంటుంది. నానో యూరియా 500 మిల్లీలీటర్ బాటిల్ ఎకరాన్ని సరిపోతుంది. ఈ ఒక్క బాటిల్ ఒక 45 యూరియా బస్తా కి సమానం. కావున రైతులు పాత పద్ధతిలో కాకుండా ఈ క్రొత్త విధానం లో నానో యూరియాని వివిధ పంటలలో పిచికారి చేసుకోవడం వలన సమయం, ఆర్థికంగా, చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది. తాడ్వాయి మండలంలోని రైతులు అందరూ కూడా దాదాపు అన్ని ద్రావణాలలో ఈ నానో యూరియాను వాడటంతో అవగాహన వచ్చి ఇది వరకే వాడిన రైతుల నుండి జిల్లా కలెక్టర్ వారి నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రైతుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్న పై రెండవ దఫాలో ఎక్కువ ఎత్తు పెరగడం వలన సాధారణ చేతి పంపు ద్వారా పిచికారి చేయడాన్ని అనుకూలంగా లేకపోవడం వలన రైతులందరూ ఎక్కువ మొత్తంలో డ్రోన్ ద్వారా నానో యూరియాని పిచికారి చేశామని తెలిపారు. దీనివలన కత్తెర పురుగు ఉధృతిని తక్కువగా ఉందని రైతులు గమనించడం జరిగిందని తెలిపారు. తాడ్వాయి మండలం లో మొక్కజొన్నపై ఇప్పటివరకు 7258 వరకు నానో యూరియాని పిచికారి చేయడం జరిగింది. ఈ మండలాల్లో ఇంత ఎక్కువ మొత్తంలో నానో యూరియాని డ్రోన్ పద్ధతిలో వాడినందుకు రైతులని అభినందించడం జరిగింది.ఇఫ్కో నానో యూరియాను వాడుతున్న రైతులకు అందరికీ ఒక బాటిల్ (500 మిల్లీలీటర్లు) కొనుగోలు చేస్తే 10,000/- రూపాయలు ఉచిత ప్రమాద బీమాను ఒక సంవత్సరం కి రైతుకు కవర్ చేయడం జరుగుతుంది. ఒక రైతుకు గరిష్టంగా 20 బాటిల్ ని చేస్తే రెండు లక్షల వరకు ప్రమాద బీమాను అందిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో మిగతా మండల రైతులు కూడా వారి పంటలలో డ్రోన్ పరికరం తో నానో యూరియాని వాడి సత్ఫలితాలు పొందాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అలాగే వ్యవసాయ శాఖ జిల్లాలోని అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో రైతులకు నానో యూరియా వాడకంపై , మరి నానో యూరియా వాడితే కలిగే ప్రయోజనాల గురించి రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి , తాడ్వాయి మండలం వ్యవసాయ అధికారి శనిగరం నరసింహులు, తాసిల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజిద్, ఏఈవోలు, ఇఫ్కో జిల్లా మేనేజర్ డి నరేష్ వారి సిబ్బంది, రైతులు మొదలైనవారు పాల్గొన్నారు.

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 7 రోజుల క్రితం16
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 4 రోజుల క్రితం14

కామారెడ్డి • 10 రోజుల క్రితం58