మోటూరి శ్రీకాంత్ కైలాస్ శ్రీనివాస్ రావు కు భేషరతుగా క్షమాపణ చెప్పాలి:ఆర్యవైశ్య సంఘం..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
బిజెపి పార్టీ కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా ఉన్న కైలాస్ శ్రీనివాస్ రావు కు వారం రోజులలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి రెసిడెన్సిల్ అపార్ట్మెంట్ వద్ద ఆర్యవైశ్య సంఘ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్ వలిపిశెట్టి లక్ష్మీరాజ్యం,మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్, గంప ప్రసాద్, ఆర్యవైశ్య పట్టణ యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ మచ్చలేని మా ఆర్యవైశ్య సంఘం ముద్దుబిడ్డ కైలాస్ శ్రీనివాసరావు ను విమర్శించే స్థాయి మోటార్ శ్రీకాంత్ కు లేదని అన్నారు, కామారెడ్డి ఆర్యవైశ్య పట్టణ సంఘం గత ఎలక్షన్లో పట్టణ సంఘం అధ్యక్షుడిగా నీకు పదవి ఇప్పించినందుకు ఆయన చేసిన పాపమా అన్నారు. 40 సంవత్సరాల నుండి పదవులు ఆశించకుండా కైలాస్ శ్రీనివాసరావు నిజమైన కార్యకర్తగా ఉన్నందున మున్సిపల్ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన సంగతి నీకు తెలియదా అన్నారు. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా ఉండి ఎన్నో సేవలు చేయడం జరిగిందని అన్నారు. రాజమౌళి పది లక్షల రూపాయలు,షబ్బీర్ అలీ 5 లక్షల రూపాయలు మరియు ఇతరులు కలిపి డొనేషన్స్ వచ్చినందున ఫంక్షన్ హాల్ కింద కట్టడం జరిగిందని అట్టి విషయం నీకు తెలియదా అని అన్నారు. మోటార్ శ్రీకాంత్ షబ్బీర్ అలీ గ ఆర్యవైశ్యులను బనియా మాల్య లవడాలు అని తిట్టినట్లు ప్రెస్ మీట్ లో మాట్లాడినావు నీవు మాట్లాడే ముందు ఆలోచన చేయకుండా మచ్చలేని మా నాయకుడిని అలా అనడం సమంజసం కాదని అన్నారు. శ్రీకాంత్ ఆ మాట అనడం ఒక్క ఆర్య వైశ్యునిగా నీకు తగదని అన్నారు ,ఆ మాటలకు ఆధారాలు నిరూపించగలవా, కన్యకా పరమేశ్వరి అమ్మవారి ముందు ప్రమాణం చేయగలవా అని డిమాండ్ చేశారు.గతంలో నువ్వు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు మీ పదవిని అడ్డుపెట్టుకొని వివేకానంద కాలనీ మరియు వేరే కాలంలో ఒక్కొక్కరి దగ్గర 40 వేలు,ఒక దగ్గర రెండున్నర లక్షలు ఒక దగ్గర 7వేలు లక్ష 50 వేల రూపాయలు తీసుకున్నది నిజం కాదా,పెద్ద బిల్డింగ్ ఓనర్ వద్ద దుబాయ్ వాచ్ మీ హయాంలో బెదిరించి తీసుకున్నది నిజం కాదా దానికి మేము ఆధారాలు చూపించగలమని, ఆధారాలు చూపిస్తే నీవు ప్రస్తుత కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తావా అన్నారు, వారం రోజులలో ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కైలాస్ శ్రీనివాసరావుకు బేషారత్ గా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తర్వాత తీసుకునే పరిణయాలు వేరే ఉంటాయని అన్నారు.