రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న డాక్టర్ బాలు, రజని దంపతులు
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న డాక్టర్ బాలు, రజని దంపతులు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన గడసాని బాలు, బుక్క రజని దంపతులకు 'రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - 2026' ఘనంగా అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాలు మరియు లింగంపేట్ మండల కేంద్రంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న బుక్క రజని దంపతులు విద్యా రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ, యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గుండా మల్లయ్య గుప్త, పవన చైర్మన్ రవి గుప్త చేతుల మీదుగా వారు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు కేవలం తరగతి గది బోధనకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థులలో నైతిక విలువలను మరియు సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తమ సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసిన నిర్వాహకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొని దంపతులకు అభినందనలు తెలిపారు.