చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి సమాజానికి ఆదర్శం: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
- కామారెడ్డిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కామారెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పేర్కొన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని.. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక అసమానతలు మరియు దోపిడీకి వ్యతిరేకంగా ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, గౌరవం దక్కేలా చేయడమే ఆమె ఆశయాలకు నిజమైన నివాళి అని తెలిపారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం సాధన దిశగా ప్రతి ఒక్కరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి, తహసీల్దార్ హిమబిందు, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉప్పా ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోదావరి స్వామి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు టీఎన్జీవోస్ (TNGOs) ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు.