కామారెడ్డిలో వైభవంగా గణేష్ నిమజ్జనం.. ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డిలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు.. ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో బుధవారం గణేష్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిమజ్జన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విగ్రహాల శోభాయాత్రను పరిశీలించి భక్తులకు గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ముగిసేలా జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశాయని వెల్లడించారు. భక్తులు మరియు ప్రజలంతా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.