© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: లింగంపేట పీఎస్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసు ఛేదన లింగంపేట పోలీసుల చాకచక్యం – హత్య కేసులో నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ఎల్లారెడ్డి డి.ఎస్.పి - ఎస్.శ్రీనవాస్ రావు వెల్లడి కేసు వివరాలు ఏమనగా, తేది 27.12.2025 న లింగాంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన ఫిర్యాదిదారుడు నరేందుల రాజు, తండ్రి విఠల్,అతని తండ్రి నాలుగు సంవత్సరాల క్రితం మరణించడముతో అతని తల్లి సులోచన, వ: 67 సం.లు ఇద్దరు కొడుకులు ఉండగా రెండు నెలలు ఒక్కరికి వద్ద ఉంటుంది. అయితే తేది 20/12/2025 నుండి పిర్యాది వద్ద ఉంటుంది. అయితే తేది 22/12/2025 పిర్యాది భార్య, పిల్లలతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్ళాడు. తేది 27/12/2025న వారి గ్రామానికి చెందిన వారు ఫోన్ ద్వారా అతని తల్లి పిలిచినా పలకడం లేదని తెలియజేశారు. వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అతని తల్లి రక్తపు గాయాలతో చనిపోయి ఉంది అని ఎవరో హత్య చేసిన బంగారు ఆభరణాలు దొంగిలించరని దరఖాస్తు ఇవ్వగా లింగంపేట పోలీసు వారు Cr.No.206/2025, U/Sec 103(1),305(A) BNS కింద కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ హత్యా కేసును ఛాలెంజ్‌గా తీసుకొని జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి DSP పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి CI మరియు లింగంపేట SI ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా ఈ రోజు 28.12.2025 ముద్రబోయిన కుమార్ (34 సం.), S/o వెంకటి, కూలీ, పోల్కంపేట గ్రామ నివాసిని నేరస్తుడిగా గుర్తించి, అరెస్ట్ చేయడం జరిగింది. దొంగిలించిన బంగారు ఆభరణాలను నేరస్తుడు అతని ఇంటి సమీపంలో పాతిపెట్టిడముతో అట్టి బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు.•నిందితుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు : 1.సుమారు ఐదు గ్రాముల బరువున్న ఒక జత బంగారు చెవి కమ్మలు 2. సుమారు మూడు తులాల బరువున్న రెండు పొరల బంగారు మంగళసూత్రం 3. సుమారు ఐదు గ్రాముల బరువున్న ఒక బంగారు ఉంగరం.ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన ఎల్లారెడ్డి CI డి. రాజా రెడ్డి, లింగంపేట SI పి. దీపక్ కుమార్, పోలీస్ సిబ్బంది మరియు హోం గార్డ్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
కామారెడ్డి • సుమారు 9 గంటల క్రితం12
కామారెడ్డి • సుమారు 15 గంటల క్రితం24
కామారెడ్డి • 8 రోజుల క్రితం45
కామారెడ్డి • సుమారు 7 గంటల క్రితం7
కామారెడ్డి • 11 రోజుల క్రితం12