3, 21వ వార్డుల్లో క్షేత్రస్థాయి పర్యటన: అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు - చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ - అధికారులకు కీలక ఆదేశాలు..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి..
వర్షాకాలం దృష్ట్యా మున్సిపాలిటీ పరిధిలోని 3వ మరియు 21వ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక కౌన్సిలర్లతో కలిసి వార్డుల్లోని పారిశుద్ధ్య పనులను, మురుగు కాలువలను స్వయంగా పరిశీలించారు. మురుగు కాలువల పూడిక తీత, డ్రైనేజీ వ్యవస్థలో తలెత్తుతున్న ఇబ్బందులను గమనించిన చైర్ పర్సన్, రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ. హన్మంతరావు, ఏ.ఈ. వేణు, స్థానిక కౌన్సిలర్లు బబ్లు, తాటి లావణ్య ప్రసాద్, అంజాద్, మహేష్, సత్యం, గణేష్, భూపతి, జావేద్, గంగాధర్, వార్డు ప్రజలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.