ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం: ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ట్యాంక్ పంపిణీ..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం: ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ట్యాంక్ పంపిణీ...
కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్ (IVF) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : కామారెడ్డి జిల్లా బ్యూరో...
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ టూరిజం కార్పోరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వాటర్ ట్యాంక్ పంపిణీ: ఎన్జీఓ (NGO) కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తాగునీటి సౌకర్యం కోసం స్టీల్ వాటర్ ట్యాంక్‌ను అందజేశారు. అన్నప్రసాద వితరణ: శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవాలే లక్ష్యం - డాక్టర్ బాలు, ఎర్రం చంద్రశేఖర్: ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ,ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు గొప్ప సామాజిక సేవకులని కొనియాడారు. "పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం సుమారు 8 వేల మందికి తాళిబొట్లు అందజేసిన ఘనత ఆయనది. ఆర్యవైశ్యుల ఐక్యత కోసం, వారి రాజకీయ మరియు సామాజిక ఎదుగుదల కోసం ఐవిఎఫ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు."ఆయన మరెన్నో సామాజిక సేవలు చేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జిల్లా కమిటీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఆధ్యాత్మిక విభాగం జిల్లా అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్, కొత్త భీమ్ రాజ్,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్,రజిత మరియు ఐవిఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.