ఆరోగ్యమే మహాభాగ్యం: తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా యోగా, ధ్యాన కార్యక్రమం.
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ప్రశస్తమైన యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
- విద్యార్థులకు యోగా శిక్షణనిచ్చిన శిక్షకుడు అజయ్ కుమార్..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:తాడ్వాయి, జూన్ 27..
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను అలవాటు చేసుకోవాలని యోగా శిక్షకుడు మిద్దె అజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు విద్యార్థులకు యోగా, ధ్యానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల పూర్వ విద్యార్థి, యోగా శిక్షకుడు అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సుమారు రెండు గంటల పాటు విద్యార్థులకు వివిధ రకాల యోగాసనాలను స్వయంగా వేసి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని వివరించారు. కళాశాల అధ్యాపకులు వీరేశం, సతీష్‌లు మాట్లాడుతూ యోగా ప్రాధాన్యతను కొనియాడారు. విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేశం, శ్రీకాంత్, అలంపల్లి శ్రీనివాస్, సరస్వతి, మనీషా, హారిక, సిబ్బంది నరసయ్య, సోటేరియా తదితరులు పాల్గొన్నారు.