NHM ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సంపూర్ణ మద్దతు
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సంపూర్ణ మద్దతు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: కామారెడ్డి
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐవవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మె శిబిరానికి కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విచ్చేసి, ఉద్యోగుల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా శిబిరంలో నాలుగు నెలల చంటిపాపను పట్టుకుని మండుటెండలో బైఠాయించిన ఒక మహిళా ఉద్యోగి దుస్థితిని చూసి ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు: ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన నిరంకుశ ధోరణిలో సాగుతోందని విమర్శించారు. శాంతియుతంగా దీక్ష చేసుకుంటున్న ఉద్యోగులకు కనీసం నీడ కోసం టెంట్ వేసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వ కుసంస్కారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజలకు ప్రాణదానం చేసే ఆరోగ్య సేవలను అందించే ఉద్యోగులను, వారి చంటిపిల్లలను రోడ్డుపై మండుటెండలో కూర్చోబెట్టడం అత్యంత గర్హనీయమని పేర్కొన్నారు.
ప్రధాన డిమాండ్లు - హామీ:
-
క్లిష్ట పరిస్థితుల్లో విధులను నిర్వర్తిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు.
-
'సమాన పనికి సమాన వేతనం' సూత్రాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-
నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది చేపడుతున్న ఈ న్యాయమైన పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారి వెంటే ఉండి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.