© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం... యువత రక్త దానానికి ముందుకు రావాలి.. సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి... స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి ఆవిష్కరించడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ యువత రక్త దానానికి ముందుకు రావాలని తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని దానికోసం నిర్వహిస్తున్న ఈ శిబిరానికి ఎక్కువ సంఖ్యలో రక్తదాతలు రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అన్నారు.ఇప్పటికీ రక్తదానం పట్ల అపోహలు ఉన్నాయని రక్త దానం చేసే వారికి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వివిధ సర్వేలు తెలియజేశాయని ఈ విషయాన్ని అవగాహన చేసుకుని రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వంచ చంద్రసేన్ రెడ్డి,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,జూనియర్ అసిస్టెంట్ సమీవుల్లా ఖాన్ లు పాల్గొనడం జరిగింది.

కామారెడ్డి • 9 రోజుల క్రితం47

కామారెడ్డి • 4 రోజుల క్రితం23

కామారెడ్డి • 5 రోజుల క్రితం39

కామారెడ్డి • 5 రోజుల క్రితం28

కామారెడ్డి • 8 రోజుల క్రితం70