© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: ప్రధాన మంత్రి - సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఐ.ఏ.ఎస్.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్, కామారెడ్డి... ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో "ప్రధాన మంత్రి - సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన" పథకానికి సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సబ్సిడీ వివరాలు: ఈ పథకం కింద 3 కిలోవాట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 78,000 సబ్సిడీ అందిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు: సోలార్ విద్యుత్ ద్వారా ప్రతి నెలా సుమారు రూ. 2,000 విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. పెట్టిన పెట్టుబడి కేవలం 5 సంవత్సరాలలోనే తిరిగి వస్తుంది. అదనపు ఆదాయం: వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును తిరిగి గ్రిడ్‌కు పంపడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు.అవగాహన కార్యక్రమాలు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు TGREDCO ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలు మరియు మున్సిపాలిటీల్లో ప్రజలకు ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.పర్యావరణ హితం: కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి చేర్చి, పర్యావరణాన్ని కాపాడడంలో సోలార్ విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, ACLB మధుమోహన్, జిల్లా ప్రజా సంబంధాల అధికారిణి తిరుమల, TGREDCO జిల్లా మేనేజర్ ఇ.రమణ, ఏ.ఎఫ్.ఓ జగదీప్ రామ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి • సుమారు 17 గంటల క్రితం24
కామారెడ్డి • ఒక రోజు క్రితం50
కామారెడ్డి • 4 రోజుల క్రితం24
కామారెడ్డి • సుమారు 11 గంటల క్రితం13
కామారెడ్డి • సుమారు 19 గంటల క్రితం62