© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

హైదరాబాద్: కౌలాస్ కోట, నిజాం సాగర్, నాగన్న (మెట్ల) బావిని పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దుతాం... రూ. 9.97 కోట్లతో నిజాం సాగర్ వద్ద ఎకో-టూరిజం అభివృద్ధి.... కౌలాస్ కోట పునరుద్ధరణకు రూ. 5 కోట్ల ప్రతిపాదనలు... శాసనసభలో మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి... కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కౌలాస్ కోట, నిజాం సాగర్ పర్యాటకాభివృద్ధిపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.స్వదేశ్ దర్శన్ 2.0 లోని CBDD (ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్) ఉప - పథకం కింద 2025 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ వద్ద ఎకో-టూరిజం అభివృద్ధికి రూ. 9.97 కోట్లతో ఎకో టూరిజం పనులు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. నిజాం సాగర్ సహజసిద్ధ ప్రకృతి అందాలను కాపాడుతూ, ఒక స్థిరమైన, పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిధులతో 17 పర్యావరణ అనుకూల మాడ్యులర్ కాటేజీలు, రెస్టారెంట్, డైనింగ్ సౌకర్యాలు, స్పా,వెల్నెస్ సెంటర్, సుందరమైన ప్రవేశ ద్వారాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకుల సౌకర్యార్థం ల్యాండ్‌స్కేపింగ్, పాదచారుల మార్గాలు,ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాల పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై అధ్యయనం.. కౌలాస్ కోట చారిత్రక, సాంస్కృతిక, పర్యావరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, వీటిని ఏకీకృత పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వివరణాత్మక సాధ్యాసాధ్యాల అధ్యయనం (Feasibility Study) చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించడమైనదని వివరించారు. పర్యాటక సామర్థ్యం, సందర్శకుల రద్దీని తట్టుకునే శక్తి... రవాణా అనుసంధానం, మౌలిక సదుపాయాల అవసరాలు..... పర్యావరణ, వారసత్వ సంరక్షణ అంశాలు... ఆర్థిక సాధ్యత, PPP (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం) వంటి అమలు నమూనాలు... ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా తగిన ప్రతిపాదనలు రూపొందించి, దశలవారీగా అమలు చేయడం జరుగుతుంది. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పర్యావరణ, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి,స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి, కామారెడ్డి జిల్లాలో సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని అన్నారు. చారిత్రక కోటకు పునర్జీవం.... పురావస్తు శాఖ పరిధిలోని చారిత్రక కౌలాస్ కోట సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి చెప్పారు.ఇప్పటికే 13వ ఆర్థిక సంఘం నిధులతో రూ.50 లక్షల అంచనా వ్యయంతో కొన్నిసంరక్షణ పనులు చేపట్టామని, కోటను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన సభకు తెలియజేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ • 3 నెలల క్రితం20

హైదరాబాద్ • 3 నెలల క్రితం17

హైదరాబాద్ • 5 నెలల క్రితం17

హైదరాబాద్ • 3 నెలల క్రితం17

హైదరాబాద్ • 5 నెలల క్రితం79