ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో 36 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి : మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి..

Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటన...
ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్సు ఫ్రీ, ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో కార్పొరేషన్లు,కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలు మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చేతి గుర్తుకు ఓటు వేయాలని అలాగే తమ ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలో 36 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ బి చిన్న ఇద్దరి నాయకత్వంలో 36 సీట్లకు 36 సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని వారిని కోరారు.ప్రజలకు రానున్న రోజుల్లో మరిన్ని పథకాలతో ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేవేస్తే మున్సిపాలిటీ వల్ల అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.