కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు: కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ల తొలగింపు..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు: కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ల తొలగింపు..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ :కరీంనగర్, జూన్ 29..
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్ బస్‌స్టాండ్ ఇన్‌గేట్ వద్ద ట్రాఫిక్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్ల అద్దాలకు ఏర్పాటు చేసిన బ్లాక్ ఫిల్మ్‌లను అధికారులు గుర్తించారు. టింట్ మీటర్ (Tint Meter) సహాయంతో అద్దాల పారదర్శకతను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫిల్మ్‌లను అక్కడికక్కడే తొలగించారు. ఈ సందర్భంగా మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానా విధించి, చర్యలు తీసుకున్నారు. వాహనదారులు నిబంధనలను పాటించాలని, రోడ్డు భద్రత దృష్ట్యా కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్‌లు అమర్చవద్దని పోలీసులు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.