© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని ఇంద్రనగర్ కాలనీ 24 వ వార్డు ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డు ఇంద్రనగర్ కాలనీ ఏకే గార్డెన్ ముందు వోడాఫోన్ టవర్ నిర్మిస్తున్నారని,వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని వార్డు ప్రజలు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ వోడాఫోన్ టవర్ నిర్మించవద్దని, వోడాఫోన్ టవర్ నిర్మించే దగ్గర చుట్టుపట్లు పక్కల 100 ఇల్లు ఉన్నాయని వోడాఫోన్ టవర్ నిర్మిస్తే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారని, రేడియేషన్ ద్వారా చిన్నపిల్లలు ఆరోగ్యాలు ప్రమాదాలకు గురి అవుతారని, ఇండ్ల మధ్యలో టవర్ నిర్మించవద్దని ఇలాంటి టవర్ నిర్మించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వోడాఫోన్ టవర్ ను ఆపివేయాలని అధికారులను కోరుతున్నామని కాలనీవాసులు అన్నారు.ఇటి విషయం పైన గత వారం రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని దయచేసి అధికారులు వోడాఫోన్ నిర్మిస్తున్న,టవర్ ను నిలిపివేయాలని అధికారులను కోరుతున్నామని అన్నారు.ఇంటి యజమాని తనకు ఇష్టం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని కానీ,వోడాఫోన్ టవర్ నిర్మిస్తే ఊరుకోమని,చుట్టుపక్కల ఇల్లు మొత్తం అతనే తీసుకోవాలని అన్నారు,ఇక్కడ నుండి మేము వెళ్ళిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు,దయచేసి అధికారులు మాకు న్యాయం చేయగలరని కోరారు.

కామారెడ్డి • 8 రోజుల క్రితం77

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 6 రోజుల క్రితం25

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 6 రోజుల క్రితం34