© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే.. జన్మదినం సందర్భంగా 80 వ సారి రక్తదానం చేసిన డాక్టర్ బాలు.. ఎస్ ఆర్ ఎస్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీసీ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తన జన్మదినం సందర్భంగా 80 వ సారి రక్తదానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం కోసం కృషి చేస్తున్నామని,ఇప్పటివరకు 25 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఐదు వేలకు పైగా యూనిట్లను సేకరించి భారతదేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ యూనిట్ల రక్తాన్ని సేకరించిన సంస్థగా గుర్తింపు పొందడం జరిగిందని అన్నారు.మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే అని ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు, మనం నిస్వార్ధంగా చేసే సేవయే మనకు ఆ భగవత్ అనుగ్రహాన్ని మరింతగా దగ్గరకు చేస్తుందని యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,జమీల్ హైమద్,డాక్టర్ వేద ప్రకాష్,పర్ష వెంకటరమణ పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి • 4 రోజుల క్రితం62
కామారెడ్డి • 2 రోజుల క్రితం18
కామారెడ్డి • సుమారు 7 గంటల క్రితం7
కామారెడ్డి • ఒక రోజు క్రితం39
కామారెడ్డి • ఒక రోజు క్రితం422