కామారెడ్డి
ప్రజావాణికి 106 ఫిర్యాదులు
SRS NEWS DESK
16 Nov 2026, 11:26 AM
23
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
ప్రజావాణికి 106 ఫిర్యాదులు
- అర్జీలను స్వయంగా స్వీకరించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుండి మొత్తం 106 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన అర్జీదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) చందర్, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) పాండు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.