ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ప్రతి ఇంటికీ ఆర్థిక భరోసా
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ప్రతి ఇంటికీ ఆర్థిక భరోసా
-
కుటుంబంలోని ప్రధాన సభ్యుడికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ
-
ఈ నెల 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పథకం ప్రారంభం
-
వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ పథకం లక్ష్యాలు, అర్హతలు మరియు అమలు విధానంపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ. 5 లక్షల తక్షణ ఆర్థిక సాయం కుటుంబానికి ఆధారమైన ప్రధాన సభ్యుడు అకాల మరణం చెందినప్పుడు, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా తక్షణ సాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సార్వజనీన జీవిత బీమా రక్షణ కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కుటుంబంలోని ఒక ప్రధాన సభ్యుడిని లబ్ధిదారుడిగా నమోదు చేస్తారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, వారి నామినీకి రూ. 5 లక్షల జీవిత బీమా పరిహారం అందుతుందని వివరించారు. గ్రామ పంచాయతీల్లోనే దరఖాస్తులు ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని, అర్హులైన కుటుంబాల వివరాలను వేగంగా సేకరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ముఖ్య ప్రణాళిక అధికారి, డీఆర్డీఓ, డీపీఓ, జెడ్పీ సీఈఓ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.