దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వార్షిక తనిఖీ
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వార్షిక తనిఖీ
-
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
-
నేరాల నియంత్రణకు రాత్రి గస్తీని పటిష్టం చేయాలి
-
కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆదేశం
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
వార్షిక తనిఖీలలో భాగంగా కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ శుక్రవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసులో సమగ్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్ఐ రంజిత్‌కు సూచించారు. అనంతరం సిబ్బందికి పలు కీలక సూచనలు చేస్తూ.. నేరాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, ఎస్ఐలు రంజిత్, బాల్ రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.