కామారెడ్డిలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
కామారెడ్డిలో ఘనంగా శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు
-
శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేక పూజలు
-
హాజరుకానున్న జిల్లా వైద్యాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు
-
ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకుల వెల్లడి
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా కార్యవర్గ నాయకులు తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా జిల్లాలో కీర్తిశేషులు పోలీస్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించే సాంప్రదాయం ఉందన్నారు. ఈ ఏడాది ఆశ్వయుజ బహుళ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని శ్రీ ధన్వంతరి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO), జిల్లా ఔషధ నియంత్రణ అధికారి (Drug Inspector) లతో పాటు కామారెడ్డి టౌన్ సీఐ, ఎస్ఐలు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని చెప్పారు. పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులకు, సభ్యులకు అన్నదాన (భోజన) సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య, అధికార ప్రతినిధి సీహెచ్. రాజయ్య, కామారెడ్డి టౌన్ ఇన్ఛార్జ్ ఎం.బి. ప్రకాష్, నాయకులు శ్రీనివాస్, పాండురంగం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.