మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న-లక్ష్మినారాయణ
Ad
ప్రకటనల కోసం
ఈరోజే సంప్రదించండి!
పాత పట్టణాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని చెత్త డంపింగ్ యార్డులా మారుస్తున్నారు
— మున్సిపల్ అధికారుల తీరుపై 46, 47 వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ ఆవేదన
కామారెడ్డి, నవంబర్ 4 (ఎస్ ఆర్ ఎస్ న్యూస్):
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత పట్టణ ప్రాంతంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని మున్సిపల్ కమిషనర్, అధికారులు కలిసి చెత్త డంపింగ్ యార్డుగా తయారు చేస్తున్నారని 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పించారు. పాత పట్టణ పరిసరాలలో మరియు పవిత్రమైన ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నిత్యం చెత్త సరిగ్గా సేకరించకపోవడంతో వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, ప్రజలు తీవ్ర దుర్గంధంతో అదనపు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని, పాత పట్టణాన్ని సుభాష్ రోడ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.