© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని గుమస్తా కాలనీలో ఉన్న కాలభైరవ పెట్రోల్ పంపు మేనేజర్ భాస్కరచారి మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన మాధవరావు అనే వ్యక్తి తన కారులో వెయ్యి రూపాయల పెట్రోల్ పోయించుకుని వెళ్లాడని, తిరిగి ఈనెల 26వ తేదీన తన కారులో కల్తీ పెట్రోల్ పోశారని కాలభైరవ పెట్రోల్ బంకుకు కారు తీసుకుని వచ్చిన మాధవరావు, నా కారు ఇంజన్ రిపేరుకు 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి మేనేజర్‌ను, సిబ్బందిని బెదిరించినట్లు భాస్కరచారి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తేదీ 18 శుక్రవారం వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ రవీందర్ రాథోడ్ మాట్లాడుతూ కాలభైరవ పెట్రోల్ బంకును తనిఖీ చేయడం జరిగిందని, తనిఖీల్లో భాగంగా పెట్రోల్‌ను పరీక్షించగా పెట్రోల్ కల్తీ లేదని అధికారులు అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ రవీందర్ రాథోడ్, డి.టి. కిష్టయ్యలు క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించి గుమస్తా కాలనీలో గల కాలభైరవ పెట్రోల్ బంకులో ఎటువంటి కల్తీ పెట్రోల్ లేదని అధికారులు మీడియాకు వివరించడం జరిగింది.

కామారెడ్డి • 5 రోజుల క్రితం39

కామారెడ్డి • 10 రోజుల క్రితం58

కామారెడ్డి • 8 రోజుల క్రితం70

కామారెడ్డి • 9 రోజుల క్రితం47

కామారెడ్డి • 6 రోజుల క్రితం34