© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram
కామారెడ్డి: వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఉత్తమ రక్తదాత పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ ఎయిడ్స్ డే 2025 ను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కు ఉత్తమ రక్తదాత గా ప్రశంస పురస్కారాన్ని జిల్లా డిఎమ్ హెచ్ఓ విద్యారాన్ వల్కర్,నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శరత్ లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రశంస పురస్కార గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా 78 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,2007వ సంవత్సరం నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని,ఇప్పటివరకు 25 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం,350 కు పైగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరిగిందని,2023 వ సంవత్సరం నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఐదు వేల యూనిట్ల రక్తాన్ని తక్కువ సమయంలో సేకరించి ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు దక్కించుకున్న సంస్థలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) సంయుక్తంగా నిలిచాయని అన్నారు.రక్తదానానికి సహకరించుచున్న రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్.నాగరాజు, డిఆర్పి సుధాకర్,వర్డ్ ఆర్గనైజేషన్,యస్ యస్ కె సిబ్బంది పాల్గొనడం జరిగింది.

కామారెడ్డి • 8 రోజుల క్రితం77
Newకామారెడ్డి • సుమారు 21 గంటల క్రితం19

కామారెడ్డి • 7 రోజుల క్రితం23

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 7 రోజుల క్రితం8