పశ్చిమ హౌసింగ్ బోర్డ్ సంకష్ట హర గణపతి ఆలయంలో విశేష పూజలు
కామారెడ్డి పట్టణంలో వైభవంగా వినాయక నవరాత్రుల నాలుగో రోజు వేడుకలు
-
పశ్చిమ హౌసింగ్ బోర్డ్ సంకష్ట హర గణపతి ఆలయంలో విశేష పూజలు
-
భారీగా తరలివచ్చిన గణపతి మాలాధారణ భక్తులు
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో వెలసిన శ్రీ సంకష్ట హర గణపతి ఆలయంలో వినాయక నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన గురువారం రోజున గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు మరియు అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. వినాయక నవరాత్రుల దీక్షలు చేపట్టిన గణపతి మాలాధారణ భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో వినాయకునికి పూజలు సమర్పించి, స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తుల నామస్మరణతో, భక్తి పారవశ్యంతో మార్మోగింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.