తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకు ఘన సన్మానం...
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణకు ఘన సన్మానం....
ఎస్ ఆర్ ఎస్ న్యూస్:హైదరాబాద్....
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన అమరవాది లక్ష్మీనారాయణ ను గురువారం ఖైరతాబాద్‌లోని చింతలబస్తీలో ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు,మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా లక్ష్మీనారాయణకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు *కైలాస్ శ్రీనివాస్ గుప్తా: మాజీ మున్సిపల్ చైర్మన్ & మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. *గౌరీశంకర్: మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అతిమాముల రమేష్ గుప్తా: వాసవి సేవాదళ్ రాష్ట్ర మాజీ చైర్మన్. మోగిలిపల్లి రమేష్: ఆర్యవైశ్య నాయకులు.అనంతరం వారు మాట్లాడుతూ.. అమరవాది లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో తెలంగాణలోని ఆర్యవైశ్య సామాజికవర్గం మరింత ఐక్యతతో ముందుకు సాగుతుందని, సంఘం బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.