బీబీపేట్కు కొత్త వెటర్నరీ ఆసుపత్రి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసిన సర్పంచ్ సాధ్విక సాయినాథ్..
బీబీపేట్ మండలానికి నూతన వెటర్నరీ ఆసుపత్రి మంజూరు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ సాధ్విక సాయినాథ్...
ఎస్ ఆర్ ఎస్ న్యూస్: హైదరాబాద్...
బీబీపేట్ మండలానికి రూ. 17.50 లక్షల వ్యయంతో నూతన వెటర్నరీ ఆసుపత్రిని మంజూరు చేయించినందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ని బీబీపేట్ సర్పంచ్ సాధ్విక సాయినాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, మండల ప్రజల అవసరాలను గుర్తించి, పశువైద్యశాల ఏర్పాటుకు కృషి చేసినందుకు షబ్బీర్ అలీ కి సర్పంచ్ సాధ్విక సాయినాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నూతన ఆసుపత్రి నిర్మాణం ద్వారా మండలంలోని పశువులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.