© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

హైదరాబాద్: సరెండర్ నిధులు రాక ఆర్థిక సుడిగుండంలో పోలీసులు.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రావలసిన నాలుగు సరెండర్ నిధులు,నాలుగు డీఏలు, జిపిఎఫ్ రుణాలు సకాలంలో విడుదల కాకపోవడంతో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎస్ఐల వరకు పోలీసులు అప్పుల బారిన పడిపోయారు. డ్యూటీలు నిర్వర్తించడంలో బిజీగా ఉండి ప్రతి సంవత్సరం ఉపయోగించని సెలవులను ప్రభుత్వం సరెండర్ చేసి డబ్బు చెల్లించాలి. అయితే సంవత్సరాలుగా ఆ నిధులు ఇవ్వకపోవడంతో ఒక్కో పోలీస్ అధికారికి 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది.సకాలంలో నిధులు రాక అప్పులు చేసి వడ్డీ కట్టే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిల్ స్కోర్లు పడిపోయాయి.. జీతం రుణాల వడ్డీలకే సరిపోవడంతో, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని పోలీసులు వాపోతున్నారు. అప్పుల కారణంగా వారి సిబిల్ స్కోర్లు తీవ్రంగా పడిపోయి, ఎక్కడా అప్పు పుట్టడం లేదని కొంతమంది పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు కష్టాల్లో.. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, గృహనిర్మాణాలు, ఆడపిల్లల పెళ్లిళ్లు అన్నీ ఆగిపోయాయని వారు చెబుతున్నారు. కొందరు పోలీసు కుటుంబాల్లో పూట గడవడం కూడా కష్టమైపోయిందని చెబుతున్నారు. ప్రైవేట్ అప్పులు, వడ్డీలు భరించలేక మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్.. “24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్న మేము పోలీసులకు రావలసిన సరెండర్ నిధులు ఇవ్వకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే మా డబ్బులు విడుదల చేయాలి.లేనిపక్షంలో పండుగల ముందు మా కుటుంబాలు మరింత ఇబ్బందులు పడతాయి” అని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

హైదరాబాద్ • 3 నెలల క్రితం130

హైదరాబాద్ • 7 రోజుల క్రితం126

హైదరాబాద్ • సుమారు ఒక నెల క్రితం32

హైదరాబాద్ • 5 నెలల క్రితం79

హైదరాబాద్ • 3 నెలల క్రితం28