తలసేమియా కరపత్రాలను ఆవిష్కరించిన గంజి రాజమౌళి గుప్తా....

తలసేమియా కరపత్రాలను ఆవిష్కరించిన గంజి రాజమౌళి గుప్తా...
మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాం....
హైదరాబాదు లోని ముషీరాబాద్ 2026 ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా నేడు తలసేమియా అవగాహనకు సంబంధించిన కరపత్రాలను ఐవిఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్, ప్రముఖ సమాజ సేవకులు గంజి రాజమౌళి గుప్తా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా గంజి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ 2026వ సంవత్సరంలో ఐవిఎఫ్ తెలంగాణ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మెగా రక్తదానాలను మరిన్ని నిర్వహిస్తామని అంతేకాకుండా తలసేమియా వ్యాధి రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని దీనిపైన రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు.తల సేమియా చిన్నారుల కోసం నిరంతరమైన రక్తదాన కార్యక్రమాల నిర్వహిస్తూ వేలాదిమంది చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ను అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ఐవిఎఫ్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు వందనపు శైలేష్ గుప్తా,ఐవిఎఫ్ లీగల్ సెల్ చైర్మన్ కోటగిరి శ్రీధర్ లు పాల్గొనడం జరిగింది.