© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: ఆర్కే కళాశాల రజతోత్సవ సన్నాహక సమావేశము.. స్థానిక ఆర్కె (రామకృష్ణ) డిగ్రీ అండ్ పీజీ కళాశాల స్థాపించబడి వచ్చే ఏడాదికి 25 సంవత్సరాలు అవుతున్న తరుణంలో కళాశాల యాజమాన్యం మరియు వ్యవస్థాపకులు ఆర్కే కళాశాల సిల్వర్ జూబ్లీ 2026 లో భాగంగా నేడు, కళాశాల ప్రారంభించిన నాటి నుండి ఇప్పుడు పని చేస్తున్న ప్రిన్సిపాల్ వరకు మరియు అడ్మినిస్ట్రేషన్ టీం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల అడ్వైజర్స్ గవర్నమెంట్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ సర్, రామకృష్ణ సర్ ,కళాశాల కరస్పాండెంట్ సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్కే కళాశాల స్థాపించి 25 సంవత్సరంలోకి చేసుకుంటున్న ఈ శుభ సమయంలో కళాశాల స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు పని చేసినటువంటి ప్రిన్సిపాల్ ని అధ్యాపకులని మరియు అడ్మిన్ టీం ని ఈ వేడుకకి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని ఈ కళాశాల అభివృద్ధికి అందరూ తోడ్పడాలని ఎంతోమంది విద్యార్థులను ఉన్నత రంగాలలో స్థిరపడేలా చేసినటువంటి ఈ కళాశాలకి అందరూ తమ వంతు కృషి చేయాలనిఇంకా ఎంతోమంది విద్యార్థులలో చైతన్యం నింపడానికి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఒక కమిటీని మరియు అలుమ్ని అసోసిషియేషన్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.తదనంతరం ఆర్కే కళాశాల వ్యవస్థాపకులను మరియు ప్రిన్సిపాల్స్ ని అంతేగాక ఉత్తమ విద్య అందించినటువంటి అధ్యాపకులని సన్మానించి వారికి గిఫ్ట్ ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మరియు చైర్మన్ భాస్కర రావు,గవర్నమెంట్ రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ విద్యాసాగర్,జనార్ధన్ రావు,కళాశాల వ్యవస్థాపకులు రామకృష్ణ ఆమేటి, ఆమేటి రమేష్,సనత్ కుమార్ శర్మ,రాజేందర్,శ్రీనివాస్ రెడ్డి,ఉపేందర్, ప్రిన్సిపాల్స్,వైస్ ప్రిన్సిపాల్స్,అధ్యాపకులు పాల్గొన్నారు.

కామారెడ్డి • 9 రోజుల క్రితం57

కామారెడ్డి • 9 రోజుల క్రితం48

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 5 రోజుల క్రితం20

కామారెడ్డి • 5 రోజుల క్రితం39