© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ... ఫిర్యాదుదారుల పట్ల గౌరవం, బాధ్యత తప్పనిసరి – పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచనలు... రోల్ కాల్, రికార్డులు, సీసీ కెమెరాల పరిశీలన – క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి* ఆస్తి నేరాల నివారణకు ముందస్తు చర్యలు – ప్రజల విశ్వాసం పెంపొందించడమే లక్ష్యం* సిబ్బంది భవిష్యత్, కుటుంబ విలువలపై జిల్లా ఎస్పీ కీలక సూచనలు*... కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా రోల్ కాల్‌ను పరిశీలించి, సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ సంవత్సరం వారి వ్యక్తిగత ఆశయాలు ఏమిటో అడిగి తెలుసుకుని,ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోరాదని,అలాగే ఆన్లైన్ గేమ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ కారణంగా పలువురు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంటూ,ఇలాంటి వాటి జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని హెచ్చరించారు. అలాగే సిబ్బంది పిల్లలు ప్రస్తుతం ఏమి చేస్తున్నారో అడిగి తెలుసుకుని, వారి మంచి భవిష్యత్తుకు పునాది వేసే విధంగా మనం వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. విధి బాధ్యతల మధ్య సమయాన్ని కేటాయించి, సాధ్యమైనంతవరకు కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి భోజనం చేయాలని, కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రతి పోలీస్ సిబ్బంది శుభ్రమైన యూనిఫారం ధరించి వృత్తి గౌరవాన్ని కాపాడాలని ఆదేశించారు.తదుపరి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, రిసెప్షన్, రైటర్ రూమ్‌లను పరిశీలించి,స్టేషన్‌ను పరిశుభ్రంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు.కేసుల నమోదు,రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి, భద్రత మరింత బలపడేలా అవసరమైన ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.బాన్సువాడ పట్టణంలో ట్రాఫిక్ పరిస్థితిని, ట్రాఫిక్ పాయింట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించారు.ప్రజల సమస్యలను మానవీయ కోణంతో అర్థం చేసుకుని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని తెలిపారు. ఈ సూచనలు సిబ్బందికి పూర్తిగా అర్థమయ్యాయా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఇటీవల జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి,ఇలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్ఐలు మరియు సిబ్బందికి ఆదేశించారు. నిరంతర పెట్రోలింగ్,గస్తీ, అనుమానితులపై నిఘా ద్వారా నేర నియంత్రణ సాధించి, పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాలు, విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జిల్లా ఎస్పీ తెలిపారు.గత సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిబద్ధతతో విధులు నిర్వహించిన ఫలితంగానే జిల్లాలో నేరాలు,దొంగతనాలు తగ్గించగలిగామని అన్నారు. ఈ విజయానికి కారణమైన మీ సమిష్టి కృషిని ప్రశంసిస్తూ, సిబ్బంది అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డీఎస్పీ విట్టల్ రెడ్డి బాన్సువాడ టౌన్ సీఐ శ్రీధర్, బాన్సువాడ రూరల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య పాటు సంబంధిత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డి • 6 రోజుల క్రితం34

కామారెడ్డి • 8 రోజుల క్రితం70

కామారెడ్డి • 7 రోజుల క్రితం8
Newకామారెడ్డి • సుమారు 24 గంటల క్రితం22

కామారెడ్డి • 7 రోజుల క్రితం16