మద్యం మత్తులో స్టీరింగ్ పడితే జైలుకే : జిల్లా ఎస్పీ..
Ad
మీ బ్రాండ్..
ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి!
ప్రకటనల కోసం ఈరోజే సంప్రదించండి.
మద్యం మత్తులో స్టీరింగ్ పడితే జైలుకే: కామారెడ్డి జిల్లా ఎస్పీ హెచ్చరిక...
•ఈ ఏడాది 3,510 కేసులు.. ₹42.01 లక్షల జరిమానా...
•508 మందికి జైలు శిక్ష.. ఇద్దరికి నెల రోజుల కఠిన కారాగారం..
ఎస్ ఆర్ ఎస్ న్యూస్ : కామారెడ్డి...
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ హెచ్చరించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల వివరాలను ఆయన వెల్లడించారు. భారీగా జరిమానాలు - జైలు శిక్షలు.. ఈ ఏడాది జనవరి 1 నుండి మే 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 3,510 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరికి కోర్టులు మొత్తం ₹42,01,000 జరిమానా విధించాయి. కేవలం జరిమానాతోనే కాకుండా, నేర తీవ్రతను బట్టి 508 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయి. 1 నుండి 5 రోజులు: 499 మందికి, 7 నుండి 15 రోజులు: 9 మందికి, 31 రోజులు:ఇద్దరు నిందితులకు శిక్ష పడింది. మీ కుటుంబం కోసం మేల్కొనండి ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. "మద్యం మత్తులో మీరు తిప్పే స్టీరింగ్ మీ కుటుంబ తలరాతను మార్చేయవచ్చు. మీ నిర్లక్ష్యం వల్ల మీ భార్యాపిల్లలు అనాథలు కాకూడదు"అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద మీ కోసం ఎదురుచూసే వారిని గుర్తుంచుకోవాలని, మద్యం మత్తులో వాహనం నడపడం అంటే 'యమపాశాన్ని' చేతబట్టడమేనని హితవు పలికారు. కేవలం జరిమానా కట్టి తప్పించుకోవచ్చనే ధీమా వద్దని, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.