© 2026 SRS News. All rights reserved.
Developed by Abhiram

కామారెడ్డి: ప్రజావాణి లో 91 దరఖాస్తులు.. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్.... ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జిదారుల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజావాణి లో 91 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించిన ఆయా దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఇస్తూ అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, dwo,డబుల్ బెడ్ రూమ్,వ్యవసాయం, పంచాయితీ,తదితర దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మార్కవుట్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూ భారతి,ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆన్నారు.అనంతరం 90 వ జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (DIPC) సమావేశం సోమవారం IDOC లో జిల్లా DIPC చైర్మన్ , జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన, DIPC కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ TG–IPASS ఆన్లైన్ ద్వారా అందిన మొత్తం 1,552 దరఖాస్తులు పరిశీలనకు రాగా,వాటిలో 1,507 దరఖాస్తులు పరిశీలించి ఆమోదించబడినవని, వివిధ కారణాల వల్ల 210 దరఖాస్తులు తిరస్కరించబడినవని అన్నారు. అదేవిధంగా T-PRIDE పథకం (SCP) కింద అజెండా అంశాలను కమిటీ చర్చించింది. ఈ పథకం కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి రాయితీగా రూ.16,71,090/- (పదహారు లక్షల డెబ్బై ఒక వేల తొంభై రూపాయలు మాత్రమే) మంజూరు చేయబడిందన్నారు. అలాగే TSP కేటగిరీ కింద 5 దరఖాస్తులకు పెట్టుబడి సబ్సిడీగా రూ.18,05,206/- (పద్దెనిమిది లక్షల ఐదు వేల రెండువందల ఆరు రూపాయలు మాత్రమే) మంజూరు చేయబడిందని ఇంకా,రెండు కోల్ అలాట్మెంట్ ప్రతిపాదనలను కమిటీ ఆమోదించి,తదుపరి చర్యల నిమిత్తం ప్రధాన కార్యాలయానికి పంపించడం జరిగిందన్నారు.ప్రజావాణి లో అదనపు కలెక్టర్లు విక్టర్,మధుమొహాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి,ఇండస్ట్రీ ఆఫీసర్ లాలూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, DIPC కమిటీ సభ్యులు,తదితరుకు పాల్గొన్నారు.

కామారెడ్డి • 5 రోజుల క్రితం39

కామారెడ్డి • 4 రోజుల క్రితం50

కామారెడ్డి • 4 రోజుల క్రితం14

కామారెడ్డి • 5 రోజుల క్రితం28

కామారెడ్డి • 9 రోజుల క్రితం70